సభలకు అనుమతి తప్పనిసరి : తేజస్ నందలాల్

సభలకు అనుమతి తప్పనిసరి : తేజస్ నందలాల్
  • ఉద్యోగులకు సెలవులు రద్దు
  •  స్పష్టం చేసిన కలెక్టర్లు

వనపర్తి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ రావడంతో ఎన్నికల కోడ్​ను పటిష్టంగా అమలు చేయాలని వనపర్తి వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం ప్రజావాణి హాల్ లో జిల్లా స్థాయి ఆఫీసర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు సభలకు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఇకపై ఉద్యోగులంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారని, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో అనుమతి లేని వాల్ రైటింగ్స్, పోస్టర్స్ కటౌట్స్ ను తొలగించాలన్నారు. ప్రతి 24 గంటలకు ఓ నివేదిక ఎన్నికల కమిషన్ కు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. విధులు నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల పై ఆర్పీ యాక్ట్ కింద చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వనపర్తి ఆర్టీవో పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తాం : 

గద్వాల : జిల్లాలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, మొత్తం ఓటర్లు 4,89,945 ఓటర్లు ఉన్నారన్నారు. పోలింగ్​ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 18 నుంచి 19 ఏళ్ల ఓటర్స్ 21 711 మంది ఉన్నారని, 80 సంవత్సరాల పైబడిన వారు 3,617 మంది ఓటర్ల వరకు ఉన్నారన్నారు. ఎన్నికల ఖర్చులకోసం రిజిస్టర్ మైంటైన్ చేసి నివేదిక నివ్వాలన్నారు అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ వాళ్లు కూడా అభ్యర్థులు ప్రచురించే ప్రతి ఎన్నికల సామగ్రిపై వారి పేరు ఎంత క్వాంటిటీ ప్రింటింగ్ చేయించారో వివరాలు తప్పకుండా పెట్టాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

 జిల్లాలో 554లో పోలింగ్​ స్టేషన్లు

నారాయణపేట : ఇప్పటి వరకు జిల్లాలో 465953 ఓటర్లు నమోదైనట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో 554 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 212 సమస్యాత్మక, 87 అతి సమస్యాత్మక పోలింగ్​ స్టేషన్లు గుర్తించి , వెబ్​ కాస్టింగ్​తో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కొత్తగా ఏర్పడటంతో జిల్లా కేంద్రంలోని శ్రీ దత్త కళాశాలలోనే మక్తల్​, నారాయణపేట కౌంటింగ్​ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వాటికంటే 150 శాతం ఎక్కువగా వివి ప్యాట్లు, 200శాతం ఎక్కువగా బ్యాలెట్​ యూనిట్​లు అందుబాటులో ఉన్నాయన్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ 1950 ​తో కాల్​ సెంటర్ ఏర్పాటు చేశామని, ఈ సారి సివిజిల్​ పై ఎక్కువ ఫోకస్​ చేస్తున్నామని విరించారు. జిల్లాలో 6 చెక్​ పోస్ట్​లు ఏర్పాటు చేశామన్నారు. 

మహబూబ్ నగర్ కలెక్టరేట్,వెలుగు : ఎన్నికల కోడ్​ సోమవారం నుంచి అమలులోకి వచ్చిందని కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న 2 నెలలు అత్యంత ముఖ్యమైందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోడ్​ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ ఎస్పీ ఆఫీస్​లో 24 గంటలు పనిచేసేలా కంప్లైంట్ సెల్ ను ఏర్పాటు చేశామని, చెప్పారు. ఈ మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ ఎస్. మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు, రమణారెడ్డి పాల్గొన్నారు. 

 కోడ్​ తప్పక పాటించాలి 

నాగర్ కర్నూల్ టౌన్ : ఎన్నికల కోడ్​ తప్పక పాటించాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అన్నీ పార్టీల లీడర్లతో సమావేశం నిర్వహించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు , ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ద్వారా ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 793 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ కే. సీతారామ రావు, ఎం.సి నోడల్ అధికారి పి. సీతారాం, జిల్లా అధికారులు, పొలిటికల్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.