
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తన పాత్రని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పోషించాలని కోరాడు. తన జీవిత చరిత్ర ఆధారంగా ఎవరైనా బయోపిక్ ను తెరకెక్కిస్తే… ఆ సినిమాలో తన పాత్రను సల్మాన్ ఖాన్ పోషించాలనేది తన కోరిక అని షోయబ్ చెప్పాడు. సల్మాన్ కు షోయబ్ వీరాభి మాని. గతంలో దుబాయ్ లో సల్మాన్ ను కలిసిన తర్వాత ఆ సంతోషాన్ని అఖ్తర్ అందరితో పంచుకున్నాడు. సల్మాన్ తో గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. ‘బీయింగ్ హ్యూమన్’ ఫౌండేషన్ ద్వారా సల్మాన్ ఎంతో సేవ చేస్తున్నాడని ప్రశంసించాడు షోయబ్ అఖ్తర్.