
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది. చాల మంది ఇలాంటి సమయంలో ఏదైనా అప్ డేట్ ఫోన్ కి మారాలని చూస్తుంటారు.. అది కూడా లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న బడ్జెట్ ఫోన్ కోసం.. మీరు కూడా ఏదైనా కొనే ముందు, ప్రాసెసర్, డిస్ ప్లే, కెమెరా, బ్యాటరీ, ర్యామ్, స్టోరేజ్ ఇలా అద్భుతమైన ఫీచర్లతో 15వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా... ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరతో అప్ డేట్ ఫీచర్లు ఉన్న ఫోన్స్ చాలానే ఉన్నాయి. అయితే 15వేలలోపు లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్ గురించి మీకోసం...
ఐక్యూఓ జెడ్ 10 ఎక్స్: ఐక్యూఓ కంపెనీకి చెందిన ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 iQOO Funtouch ఓఎస్, 2 సంవత్సరాల OS అప్‌డేట్, 6.72" FHD+ IPS LCD డిస్ ప్లే, 50MP వైడ్-యాంగిల్ కెమెరా& 2MP డెప్త్ బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో 6500mAh బ్యాటరీ ఉంది. దీనికి 6 జిబి ర్యామ్,128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీని ధర రూ.13,499.
వివో T4x 5G: వివో నుండి వస్తున్న ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 Vivo Funtouch ఓఎస్, 2 సంవత్సరాల OS అప్‌డేట్, 6.72" FHD+ IPS LCD డిస్ ప్లే, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6500mAh బ్యాటరీ దీనికి అందించారు. అలాగే 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ అప్షన్ ఉంది. దీని ధర రూ.13,999.
రెడ్‌మి నోట్ 14 SE 5G: చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నుండి వస్తున్న ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్, Android 14 Xiaomi Hyper ఒఎస్, 2 సంవత్సరాల OS అప్‌డేట్, 6.67" FHD+ AMOLED డిస్ ప్లే, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా అలాగే 20MP సెల్ఫీ కెమెరా ఉంది. 5110mAh బ్యాటరీతో 6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
పోకో ఎం7 ప్రో 5జి: ఈ చైనీస్ సబ్ బ్రాండ్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్, Android 14 Xiaomi HyperOS, 2 సంవత్సరాల OS అప్‌డేట్, 6.67" FHD+ AMOLED డిస్ ప్లే, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీనికి 5110mAh బ్యాటరీ అందించగా, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ అప్షన్ ఉంది.
రియల్ మీ నార్జో 80x 5G: రియల్ మీ నుండి వస్తున్న ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, Android 15 Realme UI ఒఎస్, 2 సంవత్సరాల OS అప్‌డేట్, 6.72" FHD+ IPS LCD డిస్ ప్లే, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఇవ్వగా, 6000mAh బ్యాటరీతో వస్తుంది. 6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ దీనిలో ఉంటుంది.