ఆధార్ కార్డు అప్ డేట్ చేస్తున్నారా..?ఈ తప్పులు చేస్తే మూల్యం చెల్లించాల్సిందే

ఆధార్ కార్డు అప్ డేట్ చేస్తున్నారా..?ఈ తప్పులు చేస్తే మూల్యం చెల్లించాల్సిందే

ఆధార్ కార్డు..అడ్రస్ ప్రూఫ్, బర్త్ ఫ్రూఫ్.. ఇలా ఇప్పుడు దేనికైనా కీలకమైన డాక్యుమెంట్.. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల సేవలను అందుకునేందుకే కాకుండా ఆర్థిక లావాదేవీల్లో్ కూడా ఇది ముఖ్యమైన పత్రం. అంతేకాదు వ్యక్తిగత గుర్తింపుకు కూడా ఇది అవసరం.. అందుకే ఆధార్ కార్డులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్దారించుకోవడం చాలా ముఖ్యం.

పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలు ఆధార్ లో చాలా ముఖ్యమైనవి. వీటిలో తప్పులుంటే అధార్ కార్డులో అధిక మార్పులు చేయాల్సినప్పుడు అదనపు ఖర్చులు భరించాల్సి రావచ్చు. అయితే ఆధార్ కార్డులో నిర్ధిష్ట సమాచారాన్ని ఎన్నిసార్లు మార్చవచ్చు లేదా అప్ డేట్ చేయవచ్చు అనే దానిపై కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. 

DOB మార్పు

ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే అప్ డేట్ చేయవచ్చు. ఆధార్ కార్డు ఎన్ రోల్ మెంట్ సమయంలో మొదటగా నమోదు చేయబడిన పుట్టిన తేదీ నుంచి గరిష్టంగా ప్లస్ లేదా మైనస్ మూడు   సంవత్సరాల్లోపు పుట్టిన తేదీలో ఏదైనా మార్పు అనుమతించబడుతుంది. 

చిరునామా: 

ఆధార్ లో చిరునామాను అప్ డేట్ చేయడంలో వెసులుబాటు ఉంది. దీనిని ఎన్ని సార్లైనా మార్చవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదు. 

పేరు మార్పు 

ఆధార్ కార్డు హోల్డర్ గరిష్టంగా రెండు సార్లు ఆధార్ కార్డులో తమ పేరును అప్ డేట్ చేసుకోవడానికి అనుమతి ఉంది. 

లింగం 

మెమోరాండం ప్రకారం.. లింగ వివరాలను ఒకసారి మాత్రమే అప్ డేట్ చేయొచ్చు. 

ఫోటో మార్పు 

ఎలాంటి పరిమితి లేకుండా తమ ఫొటోను ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మార్చుకునే స్వేచ్ఛ యూజర్లకు ఉంది. 

ఈ పరిమితిని మించితే ఏం చేయాలి ? 

ఆధార్ కార్డులో మీ పేరు, లింగ, లేదా పుట్టిన తేదీని అనుమతించిన దానికంటే ఎక్కువ సార్లు అప్ డేట్ చేయాలనుకుంటే UIDAI  ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందే. సో.. ఆధార్ వివరాలు అప్ డేట్ చేసేటప్పుడు, కొత్తగా ఎన్ రోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వివరాలు నమోదు చేసుకోవాలి.