
న్యూఢిల్లీ: గతేడాది ఓ టీవీ షోలో విమెన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌పై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సస్పెన్షన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, తద్వారా నిలకడగా పెర్ఫామెన్స్‌లు ఇచ్చానని రాహుల్ చెప్పాడు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మహిళలపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారు. దీంతో గతేడాది జనవరిలో ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో నుంచి బోర్డు వీరిద్దరిని తొలగించి స్వదేశానికి పంపించింది. రాహుల్, పాండ్యాలను బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ సస్పెండ్ చేసింది. దీనిపై తాజాగా రాహుల్ స్పందించాడు.
‘నేను బ్యాటింగ్‌లో స్థిరంగా రాణించడానికి 2019లో జరిగిన ఆ ఘటనకే ఎక్కువ క్రెడిట్ ఇస్తా. ఆ ఇన్సిడెంట్ తర్వాత భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టా. సస్పెన్షన్ అనంతరం జరిగిన పరిణామాల వల్ల నేను నా కోసం సెల్ఫిష్‌గా ఆడేవాణ్ని. అలా ఆడే క్రమంలో ఫెయిల్ అయ్యే వాణ్ని. అందుకే టీమ్ నా నుంచి ఏం కోరుకుంటుందో అదే చేయాలని నాకు నేను చెప్పుకున్నా. మా కెరీర్స్ మరీ ఎక్కువ కాలం సాగవని అందరికీ తెలుసు. ఇంకో 11 నుంచి 12 ఏళ్లు గుడ్ క్రికెట్ ఆడగలనని 2019లో నేను గుర్తించా. టీమ్ మ్యాన్‌గా, మంచి ప్లేయర్‌గా ఎదగడానికి నా మొత్తం టైమ్, ఎనర్జీని కేటాయించాలని అర్థమైంది. ఎప్పుడైతే నేను నా టీమ్ తరఫున ఇంకా బెటర్‌గా ఆడాలని, చాంపియన్ జట్టులో భాగం కావాలని గేమ్‌పై ఫోకస్ చేయడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ఇలాంటి మైండ్ సెట్ నాపై ఒత్తిడిని తగ్గించింది’ అని రాహుల్ చెప్పాడు.