వక్ఫ్ భూములను పరిరక్షించాలి

వక్ఫ్ భూములను పరిరక్షించాలి

బషీర్ బాగ్, వెలుగు:  వక్ఫ్ బోర్డు భూము లను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ విమర్శించింది. నాంపల్లి లోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మైనార్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముక్తర్ హుస్సేన్ తో కలిసి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎంఏ సిద్ధిఖి మాట్లాడారు.

 తెలంగాణలో 77 వేల ఎకరాలు ఉన్న వక్ఫ్ భూములు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు.  అధికారంలోకి వచ్చాక భూములను తిరిగి తీసుకుంటామని, వక్ఫ్ కు కమిషనరేట్ ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి, పదేళ్లలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలోని ముస్లిం డిక్లరేషన్ లో వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చినట్లు గుర్తు చేశారు.  ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్  భూముల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.