జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 20న వార్ 2 నుంచి ఊహించలేని బహుమతి

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 20న వార్ 2 నుంచి ఊహించలేని బహుమతి

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌‌‌‌‌‌‌‌రాజ్ ఫిల్మ్స్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా అప్‌‌‌‌‌‌‌‌డేట్స్ కోసం ఇటు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అటు హృతిక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 20న తారక్ పుట్టినరోజు కావడంతో అప్‌‌‌‌‌‌‌‌డేట్ వస్తుందని ఆశిస్తున్నారు. హృతిక్‌‌‌‌‌‌‌‌ రోషన్‌‌‌‌‌‌‌‌.. ఆ వివరాలను రివీల్ చేశాడు.

‘‘హే తారక్.. ఈ ఏడాది మే 20న ఏం జరగబోతోందో నీకు తెలుసా.. నన్ను నమ్ము, అదేంటో నువ్వు అసలు ఊహించలేవు.. మీరంతా సిద్ధంగా ఉన్నారా..?”  అంటూ ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టుగా అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చాడు హృతిక్. ఇందుకు థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ చెబుతూ రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్.. కబీర్ (‘వార్‌‌‌‌‌‌‌‌’‌‌‌‌‌‌‌‌లో హృతిక్ పేరు)  నిన్ను వేటాడి, నేనే నీకు రిటర్న్‌‌‌‌‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

ఈ ఇద్దరు స్టార్స్‌‌‌‌‌‌‌‌ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఈ సంభాషణ వైరల్ అవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌ స్పై యూనివర్స్‌‌‌‌‌‌‌‌లో ఆరో సినిమాగా వస్తున్న ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.