సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీఆర్ఎస్ MLA సైదిరెడ్డి, TRS ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే సైదిరెడ్డి తనపై కక్షగట్టి, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని MPP శ్రీనివాస్ ఆరోపించారు. నిబంధనల ప్రకారమే తాము ఇల్లు కట్టుకున్నా.. ఎమ్మెల్యే కూల్చివేయించారని ఆరోపించారు. అక్రమ లే అవుట్ అయితే దానికి మున్సిపల్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని TRS ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ సవాల్ విసిరారు. అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓపికతో భరించానని అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డిని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని..TRS పార్టీని చూసి పార్టీలోకి వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి చేస్తున్న భూ దందాలు పార్టీకి మచ్చ తీసుకొస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం అభివృద్ధి కాదన్నారు.
