ఇటలీలో ఆంగ్లోమేనియాపై యుద్దం.. ఇంగ్లీష్ మాట్లాడితే రూ.90లక్షలు ఫైన్..!

ఇటలీలో ఆంగ్లోమేనియాపై యుద్దం.. ఇంగ్లీష్ మాట్లాడితే రూ.90లక్షలు ఫైన్..!

ఆంగ్ల పదాలను వాడితే జరిమానా: మాతృభాషను గౌరవించాలని రాజకీయ నాయకులు తమ ప్రసంగాలలో చెప్పడం చాలాసార్లు మీరు విని ఉంటారు. దేశంలోని డాక్యుమెంట్ల నుంచి అన్నీ మాతృభాష హిందీలోనే ఉండాలని కూడా చెబుతున్నారు. అలా జరగడం లేదు అనేది వేరే విషయం. అయితే మాతృభాష కాకుండా వేరే మాట్లాడితే శిక్ష విధించే నిబంధన ప్రపంచంలో ఒక దేశంలో ఉంది.

ఇంగ్లీష్ మాట్లాడితే జరిమానా ..

ప్రస్తుతం ఇటలీలో రైట్ వింగ్ పార్టీ అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ మాతృభాషను ప్రోత్సహించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి జార్జియా మెలోని పార్టీ తరపున అధికారిక కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ లేదా ఏదైనా ఇతర విదేశీ భాషా పదాన్ని ఎవరైనా ఉపయోగించకుండా శిక్షతో పాటు, జరిమానా విధించబడుతుందనే నిబంధన జారీ చేశారు. అందులో భాగంగా పరిహారం కింద మొత్తం రూ.4 లక్షల నుంచి రూ.89 లక్షల వరకు ఫైన్ విధించబడుతుంది. ఇది ఆంగ్లోమేనియాను వదిలించుకోవడానికి అక్కడి ప్రభుత్వం వేస్తోన్న ముఖ్యమైన అడుగు. త్వరలోనే ఈ ప్రతిపాదనకు చట్టబద్ధత లభిస్తుందని విశ్వసనీయ సమాచారం.

మాతృభాషకు మించింది ఏదీ లేదు

ఇటలీలో గనక ఈ చట్టం ఆమోదం పొందితే మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు ఇతర భాషల పదాలను ఉపయోగించే అధికారులు, రాజకీయ నాయకులకు జరిమానా విధించబడుతుంది. ఇంగ్లీషులో లేదా విదేశీ భాషలను ఉపయోగించడం మాతృభాషను అవమానించడమేనని ఇటలీలోని ఒక వర్గం అభిప్రాయపడింది. యూరోన్యూస్ ప్రకారం, ఇటాలియన్ భాషా నిఘంటువులో 9000 ఆంగ్ల పదాలు చేర్చబడినట్లు అధ్యయనాలలో వెల్లడైంది.