- అంతర్జాతీయ పోటీలకు వరంగల్ క్రీడాకారుడు రాజశేఖర్ ఎంపిక
- భారత్ తరఫున వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేక దాతల కోసం ఎదురుచూపు
నెక్కొండ, వెలుగు : చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. వైకల్యం వెంటాడినా నిరాశ చెందలేదు. చదువుతో పాటు ఇష్టమైన క్రీడలో పట్టు రాణించాడు. త్రో బాల్ లో ఇండియా తరఫున ఆడి ప్రతిభ చూపాడు. ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ కు సెలెక్ట్ అయ్యాడు. అతడే.. వరంగల్జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకాల రాజశేఖర్.
గత డిసెంబర్ లో శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్ పారాత్రోబాల్లో ఇండియా జట్టు తరఫున పాల్గొని ప్రతిభ చూపి సిల్వర్మెడల్సాధించాడు. వచ్చే నెల14 నుంచి 18 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిర్వహించే ఇంటర్నేషనల్ పారాత్రోబాల్చాంపియన్ షిప్ కు సెలక్ట్ అయ్యాడు. 2024లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన పారాసిట్టింగ్వాలీబాల్ పోటీలోనూ జాతీయస్థాయిలో పాల్గొని షటిల్, అథ్లెటిక్స్ క్రీడల్లో గోల్డ్మెడల్సాధించాడు.
ఇప్పుడు ఇంటర్నేషనల్ పారా త్రోబాల్‌లో గేమ్ఆడేందుకు చాన్స్ వచ్చినా ఆర్థిక స్తోమత లేదు. పేదింట్లో పుట్టిన రాజశేఖర్పీజీ వరకు చదివాడు. క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా పేదరికం అడ్డుపడుతోంది. ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ టోర్నమెంట్‌కు వెళ్లేందుకు ఆర్థికసాయం అందించే దాతల కోసం ఎదురు చూస్తున్నాడు.
