ఖిలా వరంగల్ (మామునూర్), : వరంగల్ సిటీలో 29 వ డివిజన్ పరిధి భద్రకాళి ట్యాంక్ బండ్‌పై (పోతన రోడ్డు వైపు) గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీడబ్ల్యూఎస్ సీసీఎల్) ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ నిధులు రూ.84.20 కోట్లతో చేపట్టిన భద్రకాళి బండ్ ను మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బండ్ కు ఒక వైపు భద్రకాళి దేవాలయం, మరో వైపు పద్మాక్షి ఆలయంతోపాటు సిద్దేశ్వరుల గుట్ట భద్రకాళి బండ్ పర్యాటకానికి వన్నెతెస్తాయని, ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ కలెక్టర్/ బల్దియా ఇన్చార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
