పద్మారావునగర్, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో ఉన్న 800 ఏళ్ల నాటి చారిత్రక కాకతీయ శివాలయం ధ్వంసం కావడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పురావస్తు విభాగం స్పందించింది. న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ఈ ఘటనపై కేసు నమోదు చేసింది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో పురాతనమైన ఆలయాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సహా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాది రామారావు ఇమ్మనేని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
