దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

పర్వతగిరి/ కాశీబుగ్గ/ నెక్కొండ/ వరంగల్​ సిటీ, వెలుగు: తుఫాన్​ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. శనివారం వరంగల్​ జిల్లా పర్వతగిరి, నెక్కొండ మండలాల్లోని పలుగ్రామాల్లో తుఫాన్​ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలను కలెక్టర్​ సత్యశారద పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లకు రెండు వారాలపాటు హాలీడేస్​ లేవని, నిత్యం ఫీల్డ్​లో ఉండాలన్నారు. 

రైతులు అధైర్యపడొద్దని, నష్టపోయిన పంటల వివరాలు చేకరించి, పరిహారం అందించేలా చూస్తామన్నారు.  నెక్కొండ మండలం రెడ్లవాడలో హెల్త్​సబ్​సెంటర్​లో కరెంట్, పరిశుభ్రత లేకపోవడంపై డాక్టర్​పై అగ్రహం వ్యక్తం చేశారు.  వరంగల్​ సిటీలోని పలు కాలనీల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. హనుమకొండ పరిధిలోని పలు కాలనీల్లో బల్దియా కమిషనర్​ చాహత్​బాజ్​పాయ్​ పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.