వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వని వరంగల్ జిల్లా పోలీసులు

వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వని వరంగల్ జిల్లా పోలీసులు

వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా నుంచి కొనసాగించే పాదయాత్రపై సందిగ్ధం నెలకొంది. చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద నవంబర్ 28న షర్మిల అరెస్టుతో పాదయాత్రకు బ్రేక్ పడగా.. జిల్లాలో పునః ప్రారంభించే పాదయాత్రకు షర్మిలకు పోలీసుల నుంచి ఇంకా అనుమతి లభించలేదు. దానికి తోడు వైఎస్ షర్మిల పాదయాత్రపై  పోలీసులు షోకాజ్ నోటిసులు అందజేశారు. అనుమతి కోసం షర్మిల చేసుకున్న  దరఖాస్తును ఎందుకు నిరాకరించొద్దని పోలీసులు  షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

గతంలో నిబంధనలను అతిక్రమించి, వ్యక్తిగత దూషణకు పాల్పడటం వల్లనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని పోలీసులు ఆధారాలు జతచేసి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పాదయాత్ర అనుమతి ఎందుకు నిరాకరించకూడదో కారణాలను తెలియజేయాలని పోలీసుల నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో కోర్టు ద్వారా పోలీసుల నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు వైఎస్సార్టీపీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. అయితే షర్మిల ఇచ్చే వివరణపై పోలీసులు సంతృప్తి చెందితేనే పాదయాత్రకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.