- వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్
నర్సంపేట, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్కుమార్కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం నర్సంపేట టౌన్‌లోని రోడ్ సేఫ్టీపై బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వాహనాలు అజాగ్రత్తగా నడపడం వల్లే ఆక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. బైక్నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలన్నారు. కార్యక్రమంలో టౌన్‌సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సైలు అరుణ్‌కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలి
తొర్రూరు, వెలుగు : వాహనదారులు రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలని తొర్రూరు డీఎస్పీ క్రిష్టకిశోర్ తెలిపారు. గురువారం మహబూబాబాద్జిల్లా తొర్రూరులో రోడ్ సేఫ్టీలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్మించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ వాహనాలు, సరైన ధృవపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారుతుల తప్పకుండా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలన్నారు.
