
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వండర్ హాట్ మిర్చి క్వింటాల్ రూ.35,200 పలికింది. గురువారం మార్కెట్కు వివిధ రకాల మిర్చి బస్తాలు సుమారు 3 వేలకుపైగా వచ్చాయి. అందులో వండర్హాట్రకం మిర్చి గరిష్ఠ ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీజన్లో వండర్హాట్మిర్చికి ధర తక్కువగా ఉండడంతో మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశానని, ప్రస్తుతం పంటల సాగుకు పెట్టుబడి కోసం నిల్వ చేసిన మిర్చిని మార్కెట్లో అమ్మకానికి తెస్తే మంచి ధర పలికిందని రైతు చెప్పారు.