ఎంజీఎం సమస్యలపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

ఎంజీఎం సమస్యలపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

గ్రేటర్​ వరంగల్, వెలుగు: వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు అని వరంగల్​ ఉమ్మడి జిల్లాతో పాటు ఛత్తీస్​గడ్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లాంటి ప్రాంతాల నుంచి పేషెంట్లు వస్తుంటారని అన్నారు. 

ఇటీవల సిటీ స్కానింగ్ పరికరం సరిగా పని చేయకపోవడంతో సుమారు 30 మంది రోగులను హైదరాబాద్ నిమ్స్​ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి ఉపశమనం కల్పించినప్పటికీ భవిష్యత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా వరంగల్​ పశ్చిమ నియోజకవర్గంలోని పలు సమస్యల పై ఆయన ప్రస్తావించారు.