అబుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి : కలెక్టర్ సత్య శారద

అబుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి :  కలెక్టర్ సత్య శారద

జనగామ అర్బన్/ గ్రేటర్​ వరంగల్/ ములుగు, వెలుగు: దేశ మొదటి విద్యాశాఖ మంత్రి దివంగత అబుల్​ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జయంతి సందర్భంగా ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించారు. వరంగల్​ కలెక్టరేట్ లో, సిటీలోని రంగశాయిపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కలెక్టర్​ సత్య శారద నివాళులర్పించారు. ములుగు కలెక్టరేట్​లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవంలో భాగంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్​ దివాకర పూలమాలవేసి నివాళులర్పించారు. 

జనగామ జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజీలో మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపాల్​ పోతు అనిల్​బాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​కుమార్​ కలాం ఫొటోకు నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.