నిట్ స్టూడెంట్​ ఆత్మహత్య

నిట్ స్టూడెంట్​  ఆత్మహత్య

    ఫస్టియర్ టాపర్,

    సెకండ్ ఇయర్ ఫెయిల్ 

కాజీపేట, వెలుగు: వరంగల్​లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ(నిట్)లో బిటెక్ థర్డ్​ ఇయర్ చదువుతున్న కౌశిక్​ పాండే (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోల్​కతాలోని అవద్​ ప్రాంతానికి చెందిన కౌశిక్ పాండే వరంగల్​నిట్ లో ఈ సీఈ బ్రాంచ్ లో చేరాడు. ఫస్టియర్​లో టాపర్​గా నిలిచాడు. సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సు ఎంచుకున్నాడు. ఫస్ట్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు ఫెయిల్​కావడంతో మనస్తాపంచెంది డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన అతడికి తండ్రి బీబ్ లాబ్ పాండే నచ్చచెప్పి తిరిగి తీసుకొచ్చాడు. ఈ నెల 1వ తేదీన బీటెక్ థర్డ్ ఇయర్ లో చేర్పించాడు. కొడుకు డిప్రెషన్ లో ఉన్నందున పాండే వారం రోజులు వరంగల్ లోనే ఉన్నాడు. బిజినెస్​పనులపై ఒంగోలు వెళ్లిన పాండే బుధవారం మధ్యాహ్నం నిట్ వచ్చాడు. ఫోన్​చేసినా స్పందించకపోవడంతో  హాస్టల్ కు వెళ్లాడు.  హాస్టల్ రూమ్​తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కౌశిక్ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.  తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.