ముంపు ప్రాంతాల్లో పర్యటన : కలెక్టర్ సత్యశారద

 ముంపు ప్రాంతాల్లో పర్యటన : కలెక్టర్ సత్యశారద

వరంగల్ సిటీ/ ఖిలా వరంగల్, వెలుగు : మొంథా తుఫాన్​ దాటిగి మునిగిన ప్రాంతాల్లో సోమవారం వరంగల్​ మేయర్​ గుండు సుధారాణి, కమిషనర్​ చాహత్​ బాజ్​పాయ్, కలెక్టర్​ సత్యశారద పర్యటించారు. కాకతీయ కాలనీ ఫేస్ 1, 2 పర్యటించిన మేయర్, కమిషనర్​ ముంపునకు గురైన ఇండ్ల సమాచారాన్ని ఎన్యూమరేటర్లను ఆడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఆక్రమణలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. చిన్న వడ్డేపల్లి ప్రాంతంలోని మత్తడి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు.

 అసంపూర్తిగా ఉన్న డక్ట్ పనులను వేగవంతంగా పూర్తి చేసి నీటిని డక్ట్ లోకి పంపించాలని అధికారులకు సూచించారు. వరంగల్​ మండలంలోని రామన్నపేట, ఖిలా వరంగల్​ పరిధిలోని మల్లు స్వరాజ్యం కాలనీల్లో కలెక్టర్​ సత్యశారద పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.