
షేర్ మార్కెట్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న కిలాడి దంపతులు అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. నకిలీ కంపెనీలో పెట్టుబడులను పెట్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టి ప్రజలను మోసం చేస్తున్న కేరళకు చెందిన దంపతలు రేష్మి రవీంద్రన్ నాయర్, బిజ్జు మాధవను అదుపులోకి తీసుకన్నారు. మరో నిందితుడు గోగుల శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. ఢిల్లీ కేంద్రంగా పి.వి.ఆర్ కన్సల్టెన్సీ సర్వీసు ప్రై లిమిటేడ్ అనే బోగస్ సంస్థను ఏర్పాటు చేశారు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధికం మొత్తం డబ్బును గడించవచ్చని చెప్పారు.
హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో సంస్థ తరుపున ప్రతినిధులను ఏర్పాటు చేసుకోని వీరితో మోసాలకు పాల్పడ్డారు. హన్మకొండ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా పరిచయంతో పి.వి.ఆర్. కన్సల్టెన్సీ ద్వారా సుమారు కోటి రూపాయల పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు గుర్తి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఢిల్లీకి వెళ్లి నిందుతలను అరెస్ట్ చేశారు వరంగల్ సైబర్ పోలీసులు. నిందితుల వద్ద నుంచి రూ. 2లక్షల 50వేల రూపాయల విలువగల 50గ్రాముల బంగారు అభరణాలు, రెండు ల్యాప్ టాప్లు, హర్డ్ డిస్క్లు, స్వైపింగ్ మిషన్, 8 సెల్ ఫోన్లు, చెక్ బుక్కులు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు,స్టాంపులు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి: