
వర్ధన్నపేట, వెలుగు: ప్రతి పోలీస్ ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన వర్ధన్నపేట పీఎస్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసలు గౌరవ వందనం స్వీకరించి, పరేడ్, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు.
రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ విభాగాల పనీతీరుపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న వాటి గురించి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. తనిఖీల్లో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సైలు సాయిబాబు, రాజు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా వర్ధన్నపేట కొనారెడ్డి చెరువును సీపీ అధికారులతో కలిసి పరిశీలించారు. తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.