కాజీపేట, వెలుగు: కాజీపేట ఏసీపీ కార్యాలయంలో శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్ తనిఖీలు నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆఫీస్ వచ్చిన సీపీ స్పెషల్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ పెండింగ్ కేసులతో పాటు ఇతర రికార్డులను పరిశీలించారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించిన సీపీ అధికారులతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
నిబంధనలకు అతిక్రమించనవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‍రెడ్డి, ఇన్స్పెక్టర్లు పుల్యాల కిషన్, సుధాకర్‍రెడ్డి, చేరాలు, శ్రీధర్‍రావు, పులి రమేశ్ పాల్గొన్నారు.
సీపీని కలిసిన ములుగు ఎస్పీ
ములుగు: వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఓఎస్డీ శివం ఉపాధ్యాయతో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రెండు జిల్లాల మధ్య పోలీసింగ్ సమన్వయం, న్యాయ, శాంతిభద్రత వ్యవస్థల బలోపేతం, నేరాలు నివారణ చర్యలు, ప్రధాన అపరేషన్ల సమయంలో సమన్వయంతో పనిచేయడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు ఎస్పీ తెలిపారు.
