వరంగల్/కరీమాబాద్/నర్సంపేట, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీయి జాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మర్డర్లు. దాడులు, అసాంఘిక కార్యక లాపాలు పెరుగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో వారం రోజులుగా పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కొందరికి హెచ్చరికలు జారీ చేస్తూ, మరికొందరిని బైండోవర్ చేస్తున్నారు. సోమవారం వరంగల్ సిటీ పోలీసులు మరో అడుగు ముందుకేసి రౌడీషీటర్లను మండుటెండలో ప్రధాన రహదారులపై నడిపించారు.
వరంగల్ సిటీలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు 34 మంది రౌడీషీటర్లను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. అనంతరం వారిని స్టేషన్ నుంచి ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాల యం.వరకుసుమారు 3 కిలోమీటర్లు రోడ్లపై నడిపిం చారు. ముందుగా పోలీసులు,మధ్యలో రౌడీషీటర్లు, వెనుక పోలీస్ వాహనాలతో సాగిన ఈ కవాతును రద్దీ రోడ్లపై ఉన్న ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.. నర్సంపేటలోనూ 126 మంది రౌడీషీటర్లకు ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు ముష్క శ్రీనివాస్, సాయిరమణ కౌన్సెలింగ్ ఇచ్చారు
