- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సర్పంచ్ పోస్టుకు 463, వార్డు మెంబర్స్థానాలకు 237 నామినేషన్లు దాఖలు
- వచ్చే నెల 11న మొదటి విడత 455 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో పంచాయతీ ఎన్నికల సందడి మొదలయ్యింది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు నిర్వహించనుండగా, గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటిరోజు సర్పంచ్ పోస్టుకు 463, వార్డు మెంబర్ స్థానాలకు 237 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల నిర్వహణ తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు కమిషరేట్ పరిధిలో సీపీ సన్‍ప్రీత్‍సింగ్ పలు జీపీలకు వెళ్లి పరిశీలించారు.
ఉమ్మడి జిల్లాలో 1,683 జీపీలకు ఎన్నికలు..
ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లో 1,683 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా నుంచి 482 జీపీలు ఉండగా, ఆ తర్వాత వరంగల్ 317, జనగామ 280, భూపాలపల్లి 248, హనుమకొండ 210, ములుగు జిల్లాలో 146 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడుతలో 455 జీపీలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
మొదటి విడత ఎన్నికలకు తొలిరోజు వచ్చిన (సర్పంచ్, వార్డు మెంబర్) నామినేషన్లు
వరంగల్ జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
వర్ధన్నపేట 18 22 8
పర్వతగిరి 33 34 24
రాయపర్తి 40 45 5
మొత్తం 91 101 37
హనుమకొండ జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
భీమదేవరపల్లి 25 30 22
ఎల్కతుర్తి 20 17 4
కమలాపూర్ 24 36 34
మొత్తం 69 83 60
భూపాలపల్లి జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
ఘనపూర్ 17 6 2
కొత్తపల్లిగోరి 16 7 9
రేగొండ 23 15 7
మొగుళ్లపల్లి 26 17 17
మొత్తం 82 45 35
మహబూబాబాద్ జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
గూడూరు 41 28 18
ఇనుగుర్తి 13 13 5
కేసముద్రం 29 21 4
మహబూబాబాద్ 41 20 12
నెల్లికుదురు 31 22 2
మొత్తం 155 104 41
జనగామ జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
చిల్పూర్ 17 17 10
స్టేషన్ఘనపూర్ 15 17 7
రఘునాథపల్లి 36 35 8
జఫర్గడ్ 21 24 8
లింగాల ఘనపూర్ 21 15 11
మొత్తం 110 108 44
ములుగు జిల్లా
మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు
తాడ్వాయి 18 16 4
ఏటూరునాగారం 12 4 4
గోవిందపూర్ 18 2 12
మొత్తం 48 22 20
