వరంగల్, వెలుగు: రాష్ట్రంలో క్రీడలకు గతంలో లేనివిధంగా సీఎం రేవంత్‍రెడ్డి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తెలిపారు. శనివారం ఆయన హనుమకొండ జవహర్‍లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ సీఎం రేవంత్‍రెడ్డి వేసవి శిక్షణ శిబిరాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.
మొత్తం 21 క్రీడల్లో శిక్షణ అందిస్తారన్నారు. క్రీడలు కేవలం శారీరక దారుఢ్యానికే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మార్గం చూపుతాయన్నారు. శిబిరానికి 350 మంది స్టూడెంట్లు ఎంపిక కావడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్వో ప్రశాంత్, కాంగ్రెస్ నేత బొద్దిరెడ్డి ప్రభాకర్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
