వరంగల్, వెలుగు: పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
హనుమకొండ గోకుల్ నగర్ అంబేద్కర్ భవన్‌లో బుధవారం హనుమకొండ, కాజీపేట మండలాలకు సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 159 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,59,18,444 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
