మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఖమ్మం 31వ డివిజన్ లో సీపీఎం పార్టీ అభ్యర్థి యర్రా గోపి గెలిచారు. 19వ డివిజన్ లో సీపీ అభ్యర్థి వెంకన్న విజయం సాధించారు. ఖమ్మం 7వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ గెలిచారు. 37,13, 25వ డివిజన్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 49, 55వ డివిజన్ లో కాంగ్రెస్ విజయం సాధించింది.
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ఏడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా శ్రీను గెలిచారు. 1వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల బిక్షం రెడ్డి గెలిచారు. 2వ వార్డులో టీఆర్ఎస్ క్యాండిడేట్ రాచకొండ సునీల్ గెలిచారు. నకిరేకల్ 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుకన్య విన్నయ్యారు. 8వ వార్డులో పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. నకిరేకల్ 13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పోతుల సునీత గెలిచారు. 19వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రాచకొండ శ్రీను గెలిచారు.
కొత్తూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 2 వార్డుల్లో గెలిచింది. అచ్చంపేట 1,10,7వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.16వ వార్డులో టీఆర్ఎస్ విజయం సాధించింది.
మహబూబ్ నగర్ జడ్చర్లలో ఐదు వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
