నన్ను గెలిపిస్తే బర్రెలకు కాపలా ఉంటా..వార్డు మెంబర్‌‌‌‌గా పోటీ చేస్తున్న వ్యక్తి వినూత్న హామీ

నన్ను గెలిపిస్తే బర్రెలకు కాపలా ఉంటా..వార్డు మెంబర్‌‌‌‌గా పోటీ చేస్తున్న వ్యక్తి వినూత్న హామీ

తిర్యాణి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు రాబట్టుకునేందుకు సర్పంచ్‌‌‌‌లు, వార్డు సభ్యులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా తిర్యాణి మండల కేంద్రంలోని మూడో వార్డ్‌‌‌‌ మెంబర్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌గా పోటీ చేస్తున్న కూన సతీశ్‌‌‌‌ వినూత్న ప్రచారానికి తెర లేపాడు. తనను గెలిపిస్తే వార్డులో ఉన్న అందరి గేదెలను ఓ చోటుకు తొలుకొచ్చి, ఆ మందకు కాపలా ఉంటానని చెబుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నాడు.