వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామస్తులు పంచాయతీ ఆఫీసు వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. బతుకమ్మ రోజు కూడా నీళ్లు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాగా ఆఫీసు వద్ద అధికారులు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన అనంతరం సాయంత్రం గ్రామ కార్యదర్శి నీటి ట్యాంకర్ పంపించాడని కాలనీ వాసులు తెలిపారు.