మార్క్ మామ ఇలాకాలోకి వార్నర్: డాన్స్‌లు ఆపేయమని సలహా!

మార్క్ మామ ఇలాకాలోకి వార్నర్: డాన్స్‌లు ఆపేయమని సలహా!

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు పోటీగా సోషల్ మీడియా దిగ్గజం మెటా.. థ్రెడ్స్ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. వ్యాపారవేత్తల మొదలు సినీ సెలెబ్రెటీలు, క్రికెటర్ల వరకూ అందరూ థ్రెడ్స్ యాప్ వైపు పరుగులు పెడుతున్నారు. తాజాగా, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ యాప్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఈ విషయాన్ని అతను నలుగురితో పంచుకోవడమే తాను చేసిన తప్పు.

వార్నర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతనొక మంచి డ్యాన్సర్. ఎన్నో పాటలకు కాలు కదిపాడు. 'బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ..' పాటకు వార్నర్ వేసిన స్టెప్పులు మరో లెవెల్ అని చెప్పాలి. అలాంటి ప్రయోగాలు థ్రెడ్స్ యాప్‌లోనూ చేస్తారేమో అన్న భయం సహచర ఆటగాళ్లను పట్టుకుంది. 'థ్రెడ్స్ యాప్ లోకి వచ్చేశా..' అంటూ వార్నర్ పోస్ట్ పెట్టగానే సహచర ఆటగాళ్లందరూ..'ఇక ఆపేయ్.. ఇక్కడ డాన్స్‌లు వద్దు' అంటూ అతనికి మొరపెట్టుకుంటున్నారు. 

"నేను థ్రెడ్స్‌లో జాయిన్ అయ్యాను" అంటూ వార్నర్.. ఆసీస్ సారథి ప్యాట్ కమ్మిన్స్‌ను టాగ్ చేశారు. అందుకు బదులిచ్చిన కమ్మిన్స్.. 'జాయిన్ అయితే అయ్యావు కానీ.. ఇక్కడ డ్యాన్స్ వీడియోలు మాత్రం పోస్ట్ చేయకు ప్లీజ్..' అంటూ మొరపెట్టుకున్నారు. అయితే ఈ వివాదంలోకి రిషబ్ పంత్ తలదూర్చటం గమనార్హం. 'బెస్ట్ అడ్వైజ్ బ్రో..' అంటూ పంత్..  కమ్మిన్స్‌కు వత్తాసు పలికాడు. ఏదేమైనా వీరి ముగ్గురి ఫన్నీ సంభాషణ మాత్రం అభిమానులకు నవ్వు పూయిస్తోంది.