హైదరాబాద్‌సిటీ, వెలుగు : ‘హైదరాబాద్నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్‌మెంట్‌బోర్డు 2026 ..ఎలాంటి పరీక్ష లేకుండా వాక్ఇన్ఇంటర్వ్యూలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్’అంటూ ఓ ఫేక్ప్రకటన సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సెక్యూరిటీ గార్డు, ఆఫీస్అటెండెంట్, సహాయక సిబ్బంది కావాలని, జీతం రూ.33, 500 నుంచి 52800 వరకు ఉంటుందని కేటుగాళ్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 8వ తరగతి, 10, 12 పాసై ఉండాలని, అస్సలు చదువు లేకపోయినా ఉద్యోగాలిచ్చేస్తామని మెన్షన్చేశారు.
పైగా, వసతి, భోజనం, బోనస్‌లు కూడా ఉంటాయని ఊదరగొట్టేశారు. ఉద్యోగాలు కావాలంటే లింక్‌పై క్లిక్ చేయాలని కోరారు. ఇది సోషల్‌మీడియాలో తిరుగుతుండడంతో గుర్తించిన వాటర్‌బోర్డు అధికారులు ఈ ప్రకటనను నమ్మవద్దని ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాలు ఉంటే టీజీపీఎస్సీ ద్వారానే ప్రకటనలు వస్తాయని తెలిపారు.
