కూకట్ పల్లిలో జలమండలి అధికారుల తనిఖీలు.. అక్రమంగా నల్లాలకు బిగించిన 18 మోటార్లు సీజ్

కూకట్ పల్లిలో జలమండలి అధికారుల తనిఖీలు.. అక్రమంగా నల్లాలకు బిగించిన 18 మోటార్లు సీజ్

జీహెచ్ ఎంసీ పరిధిలో లో ప్రెజర్ ,నీటి సరఫరా సమస్యలకు చెక్ పెట్టేందుకు  జలమండలి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా నల్లా పైపు లైన్లకు మోటార్లు బిగించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు జలమండలి విజిలెన్స్ అధికారులు. బుధవారం ( మే6)  తెల్లవారు జామునుంచే తనఖీలు చేపట్టారు.  కూకట్ పల్లి జోన్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. బాలాజీనగర్, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1 లో  స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నీటి సరఫరా జరుగుతున్న సమయంలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా నల్లా పైపులైన్లకు బిగించిన మోటార్లను గుర్తించారు కూకట్ పల్లి జోన్ లో ఒక్కరోజే 18 మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. 

నగరంలో నీటి కొరత లేకుండా చూసేందుకు జలమండలి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా నగరంలోని బస్తీలు, కాలనీల్లో తనిఖీలు చేస్తూ నీటి పైపు లైన్లకు అక్రమంగా బిగించిన మోటార్లను సీజ్ చేస్తున్నారు. రెండోసారి ఇలాంటి తప్పు చేస్తే 5 వేల జరిమానా, కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.