హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాటర్‌బోర్డు లోగోను ప్రైవేట్ట్యాంకర్లు నడిపే వారు వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై క్రిమినల్‌చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరించారు. వాటర్‌బోర్డు పేరు, లోగో, బ్రాండ్‌ను ఉపయోగిస్తూ కొంతమంది ప్రైవేట్ బోర్‌వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు నీటి సరఫరా చేయడంపై ఫైర్అయ్యారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు బోర్వెల్స్నుంచి తీసుకుంటారని, ఆ నీటిని వాడడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. తమ టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి నీటిని బుక్చేసుకోవాలన్నారు.
