జూలై 31న వాటర్​సప్లయ్ ​బంద్

జూలై 31న వాటర్​సప్లయ్ ​బంద్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 30న ఉదయం 6 గంటల నుంచి 31 ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. పటాన్ చెరులోని మంజీరా ఫేజ్–-1 పైపులైన్​ జంక్షన్ పనుల నేపథ్యంలో 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

బీహెచ్ఈఎల్ టౌన్ షిప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్ చెరు, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్ పేట, డోయెన్స్ కాలనీ, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు.