ఇదేందయ్యా ఇది: వంట గ్యాస్ సిలిండర్ లో నీళ్లు

ఇదేందయ్యా ఇది: వంట గ్యాస్ సిలిండర్ లో నీళ్లు

వరంగల్ జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురయింది. వంట చేసేందుకు వినియోగించే గ్యాస్ లో వంట గ్యాస్ ఇంధనంకు బదులు సిలిండర్ లో నీరు వచ్చింది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే వినియోదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశాడు. 

సంగెం మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్ రాగ వచ్చిన సిలిండర్ ను గ్యాస్ పొయ్యికి అనుసంధానించాడు.. ఎంత చూసిన గ్యాస్ పొయ్యి వెలగాకపోవడంతో అసలు సిలిండర్ లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానంతో గ్యాస్ సిలిండర్ ను పరిశీలించాడు. ఇంకేముంది ఆ సిలిండర్ లో గ్యాస్ కాకుండా నీరు ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా నిర్గాంత పోయాడు. 

ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వ్యవహారం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.