గాయత్రి పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోత

గాయత్రి పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోత

రామడుగు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంపుహౌస్​ నుంచి శుక్రవారం వరకు ఒక టీఎంసీ నీటిని మిడ్​మానేర్​కు ఎత్తిపోసినట్లు డీఈ రాంప్రసాద్​ తెలిపారు.  ఎల్లంపల్లి నుంచి మూడు పంపుల ద్వారా 9,450 క్యూసెక్కుల నీరు నందిమేడారం జంట సొరంగాల ద్వారా గాయత్రి పంపుహౌస్​కు చేరుతుండగా అంతే నీటిని డెలివరీ సిస్టర్న్స్​నుంచి గ్రావిటీ కెనాల్​ ద్వారా వరదకాలువకు, అక్కడి నుంచి మిడ్​మానేరుకు తరలిస్తున్నారు.

 గాయత్రి పంపుహౌస్​లో 1, 2, 4 బాహుబలి మోటార్లను ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నడిపిస్తూ నిత్యం 0.33 టీఎంసీల నీటిని మిడ్​మానేరుకు తరలిస్తున్నట్లు డీఈ పేర్కొన్నారు.