
- కూసుమంచి మండల ఆఫీసర్ల నిర్వాకం
కూసుమంచి, వెలుగు : బర్త్ సర్టిఫికెట్‌కావాలని అప్లై చేస్తే.. ఆఫీసర్లు డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని గట్టు సింగారం గ్రామానికి చెందిన కడారి మమత తన కూతురు మాదవిద్యకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని స్థానిక గ్రామ పంచాయతీలో అప్లై చేసుకుంది. జీపీలో రికార్డులు లేకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్‌లో అప్లై చేసుకోవాలని విలేజ్ సెక్రటరీ సూచించాడు. దీంతో మమత 2024 డిసెంబర్‌లో కూసుమంచి తహసీల్దార్ ఆఫీస్‌లో దరఖాస్తు అందజేసింది.
అప్పటి నుంచి కాలయాపన చేసిన జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఈ నెల 4న సర్టిఫికెట్ ఇచ్చాడు. మమత సర్టిఫికెట్‌ను పరిశీలించగా... అందులో బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ అని రాసి ఉంది. దీంతో మమత జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. అతడు ఆ సర్టిఫికెట్‌ను చించి వేసి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దానిని తీసుకొని విలేజ్ సెక్రటరీ వద్దకు వెళ్లగా సర్టిఫికెట్‌లో డెలివరీ అయిన హాస్పిటల్‌కు సంబంధించిన వివరాలు లేవని, అన్ని వివరాలతో మరో సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించాడు.
మమత తిరిగి తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును కలిసి అన్ని వివరాలతో కొత్త సర్టిఫికెట్ జారీ చేయాలని కోరింది. దీంతో అతడు ‘అసలు సర్టిఫికెట్ ఇవ్వడమే గొప్ప.. మళ్లీ వస్తావా.. తహసీల్దార్‌ను అడుక్కో పో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై తహసీల్దార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేసినట్లు మమత తెలిపింది. వివరాలను సవరించి మరో సర్టిఫికెట్ జారీ చేస్తామని తహసీ ల్దార్ రవికుమార్ చెప్పారు.
వరి, ఆరుతడి పంటలకు నీళ్లు
భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లో 50.34 టీఎంసీల నీటి నిల్వ ఉందని లెక్క తీసిన అధికారులు.. 3,93,430 ఎకరాల్లో వరి పంటకు, 78,307 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా మేజర్ ప్రాజెక్టుల కింద 3,29,847 ఎకరాలు, మీడియం ప్రాజెక్ట్‌ల కింద 1,41,890 ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్1 కింద 2,34,639 ఎకరాలకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే, లోయర్‌మానేరుకు ఎగువన సరస్వతి, కాకతీయ కెనాల్స్ ద్వారా ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. ఇందుకు 25.30 టీఎంసీల జలాలు అవసరమవుతాయని తేల్చారు.
అలీసాగర్ లిఫ్ట్ కింద 49,803 ఎకరాలు, గుత్ప లిఫ్ట్ కింద 35,405 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి మంథని లిఫ్ట్ కింద 10 వేల ఎకరాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా, ఇప్పటికే కృష్ణా బేసిన్‌లో 10,30,082 ఎకరాల్లో వరి, 7,38,158 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లివ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తంగా కృష్ణా బేసిన్‌లో 17.68 లక్షల ఎకరాలు, గోదావరిలో 4.71 లక్షల ఎకరాలకు వర్షాకాలంలో నీళ్లను అందించనున్నారు. గోదావరిలో వరదను బట్టి మరోసారి స్కివమ్ మీటింగ్‌ను నిర్వహించి నీటి లభ్యతపై అధికారులు చర్చించాలని నిర్ణయించారు.