లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్ నుంచి నీటి విడుదల

లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్ నుంచి నీటి విడుదల

రామడుగు, వెలుగు: రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్​లో ఆరో మోటార్​ ఆన్​ చేసి గ్రావిటీ కెనాల్​ ద్వారా మిడ్​మానేర్​కు నీటిని విడుదల చేశారు. ​ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిని విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ను కోరగా ఆయన ఆదేశాలతో గాయత్రి పంప్ హౌజ్ నుంచి నీటిని విడుదల చేసినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. 

మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజీ హరీశ్, నాయకులు గాయత్రి పంపుహౌస్​ వద్ద ప్రత్యేకంగా పూజలు చేపట్టారు. ఒక మోటార్​ నుంచి రోజుకు 3150 క్యూసెక్కుల నీరు మిడ్​మానేరుకు వెళ్తుందని పంపుహౌస్​ అధికారులు తెలిపారు.