గ్రేటర్ లో ఎల్లుండి వాటర్​ సప్లయ్ బంద్

గ్రేటర్ లో ఎల్లుండి వాటర్​ సప్లయ్ బంద్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 4న గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో వాటర్ సప్లయ్ బంద్​చేస్తున్నట్లు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. సింగూరు ఫేజ్–3, 4కు కరెంట్​సరఫరా చేసే పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో ట్రాన్స్ కో అధికారులు రిపేర్లు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 4న ఉదయం 7 గంటల నుంచి 5న ఉదయం 7 గంటల వరకు పనులు కొనసాగుతాయని, ఆ టైంలో గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాలకు వాటర్​సప్లయ్​జరగదని వెల్లడించారు.

షేక్ పేట, భోజగుట్ట రిజర్వాయర్ ప్రాంతాలు, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్ బీ, హైదర్ నగర్, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్ పేట, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్, ఓఅండ్ఎం డివిజన్-8 లోని బల్క్ కనెక్షన్స్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు.