వాటర్ ట్యాప్‌లకు ఉండే గ్రిల్‌లో దుమ్ము ఇరుక్కుపోతే ఫ్లో తగ్గిపోతుంది. అలాంటివాటిని ఈ బ్రష్‌తో ఈజీగా క్లీన్ చేయొచ్చు. దీన్ని వోర్వెన్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇవి బాత్ షవర్లు, మొబైల్ స్పీకర్ గ్రిల్స్ లాంటి వాటికి ఉండే చిన్న రంధ్రాలను శుభ్రం చేయడానికి తయారుచేసిన మల్టీఫంక్షనల్ టూల్స్. వీటితో షవర్ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని లేదా నీటి వల్ల ఏర్పడే పొరను తొలగించవచ్చు.
ఈ బ్రష్‌లు సందులు, చిన్న రంధ్రాలలోకి 1 సెం.మీ. లోతు వరకు చొచ్చుకుపోతాయి. హై క్వాలిటీ నైలాన్ బ్రిసిల్స్‌తో తయారైన ఈ బ్రష్‌లు క్లీనింగ్ చేసేటప్పుడు వస్తువులపై చిన్న గీత కూడా పడదు. వీటిని కీబోర్డ్ సందులు, మొబైల్ చార్జింగ్ పోర్ట్‌లను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. సెట్‌లో 10 చిన్న బ్రష్‌లు ఉంటాయి.
ఈ క్లీనింగ్ బ్రష్ ధర 152 రూపాయలే.
