
మా బాధ్యత కాదంటే.. మా బాధ్యత కాదంటూ జలమండలి, హెచ్ ఎండీఏలు రెండూ చేతులెత్తేయటంతో నగరంలో మురుగునీటి శుద్ధి ఆగిపోయింది .సివరేజి ట్రీట్ మెంట్ (ఎస్ టీపీ) నిర్వహణలో సమన్వయం లేక చాలాచోట్ల శుద్ధి అటకెక్కింది .
సిటీలో మురుగునీటి శుద్ధి కోసం 18 సివరేజ్ ట్రీట్ మెంట్ ప్ల ాంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి నిర్వహణను జలమండలి, హెచ్ ఎండీఏ చూసుకునేవి. 4 ఎస్టీపీలు జలమండలి, 14 ఎస్టీపీలు హెచ్ ఎండీఏ ఆధీనంలో ఉండేవి. 2016 జూన్ లో తాగునీరు,
మురుగు నీటి నిర్వహణను వాటర్ బోర్డే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది . దీంతో 18 ఎస్టీపీలు జలమండలి ఆధీనంలోకి వచ్చాయి. వీటివల్ల ఆర్థిక భారం పెరగడంతో గతంలో హెచ్ ఎండీఏ పరిధిలో ఉన్న ఎస్టీపీలను తిరిగి ఆ శాఖకే అప్పగిం చాలని ప్ర-
భుత్వాన్ని కోరింది వాటర్ బోర్డ్. అప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలోని నాలుగు ఎస్టీపీలను మాత్రమే హెచ్ఎండీఏ తిరిగి తీసుకుంది . మిగతా 10 కూడా తీసుకోవాలని జలమండలి కోరింది . కానీ వాళ్లు పట్టిం చుకోలేదు. దీంతో వాటర్ బోర్డ్ కూడా ఆ 10
ఎస్టీపీలను గాలికి వదిలేసింది .
శుద్ధి చేసేది 55 ఎంఎల్ డీలే..నగరంలో రోజూ దాదాపు 1400 ఎంఎల్ డీ (మిలియన్ లీటర్ పర్ డే ) మురుగునీరు వస్తోంది . 18 ఎస్టీపీలకు రోజుకు 750 ఎంఎల్ డీ మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 650 ఎంఎల్ డీలను నేరుగా మూసీలోకి వదిలేస్తున్నారు. కేవలం 55 ఎంఎల్ డీల నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. ఈ పని కూడా హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన బాల్కాపూర్ , బంజారా, పికెట్ , కూకట్ పల్లి నాలాల ఎస్టీపీలు మాత్రమే చేస్తున్నాయి. ఆర్థిక భారంతోనే నిర్లక్ష్యం జలమండలి పరిధిలో అంబర్ పేట, నాగోలు, నల్లచె రువు, అత్తాపూర్ చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ఎస్టీపీల ద్వారా రోజుకు 592 మిలియన్ లీటర్లు, మిగిలిన ఎస్టీపీల ద్వారా హెచ్ ఎండీఏ 102.8 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేవి. మిలియన్ లీటర్ల నిర్వహణకు రోజుకు రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుం దని అధికారులు తెలిపారు.
దీని ప్రకారం నెలకు జలమండలికి రూ.5 కోట్లు, హెచ్ ఎండీఏకు కోటి రూపాయలు భారం పడుతోంది . జలమండలికి ఉన్న భారానికి అదనంగా హెచ్ ఎండీఏ పరిధిలోని ఎస్టీపీల నిర్వహణ చేపట్టడంతో మరో రూ.కోటి భారం పడింది . దీన్ని భరిం చలేకే జలమండలి తిరిగి హెచ్ ఎండీఏకు అప్పగించేం దుకు ప్రయత్నాలు సాగిస్తుంది . రెండు శాఖల మధ్య ఇప్పటికీ క్లారి టీ లేకపోవడంతో మురుగు నీటిని నేరుగా మూసీలోకి వదిలివేస్తున్నారు. ఫలితంగా మూసీ పక్కన నివసిం చే ప్రజలకు దోమల బెడదతోపాటు డెంగ్యూ, మలేరియా లాంటివిష జ్వరాలు వస్తున్నాయి.