ఎండుతున్న పంటలు..రాష్ట్రంపై కరువు పడగ

ఎండుతున్న పంటలు..రాష్ట్రంపై కరువు పడగ

రాష్ట్రంలో కరువు పరిస్థితులు కన్పిస్తున్నాయి. గతేడాదితక్కువ వర్షపాతంతో రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు . ఈసారి కూడా తిప్పలు తప్పేలా లేవు. ప్రస్తుతం దేశంలోని 634 జిల్లాల్లో 393 జిల్లాలు కరువునుఎదుర్కొంటున్నాయని, మన రాష్ర్టంలో ఖమ్మం ,ఆదిలాబాద్‌ జిల్లాలు కూడా తీవ్ర కరువు బారిన పడేప్రమాదం ఉందని ఐఐటీ రీసర్చర్లు తమ అధ్యయనంలో తెలిపారు. వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోనూ కరువు ఛాయలు ఉన్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌,నిజామాబాద్‌, మెదక్‌, రంగా రెడ్డి, హైదరాబాద్, మహ-బూబ్ నగర్‌ జిల్లాలూ కరువు ముప్పు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నట్లు ఆ సర్వే చెప్పింది. 2018లో రాష్ట్రం లో 8శాతం లోటు వర్షపాతం నమోదైంది. 845 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. డిసెంబర్నాటికి 776 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.

పాతాళంలో జలం

భూగర్భ జల మట్టం పాతాళానికి పడిపోతోంది.గతేడాది మార్చిలో రాష్ర్టంలో సగటు భూగర్భ జలమట్టం 11.88 మీటర్లుగా ఉంటే.. ఇప్పుడది 13.40మీటర్లు కిందకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సగటున 12.52 మీటర్ల లోతులో నీరు లభిస్తే..మార్చి కి వచ్చేసరికి 13.40 మీటర్లకు చేరింది.మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 24.55 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. మరో 20 జిల్లాల్లోనూపరిస్థితి ఇలాగే ఉంది. 2018 మార్చితో పోలిస్తే,2019 మార్చి లో 21 జిల్లాల్లో భూగర్భజల మట్టం తగ్గింది. చివరి దశలో ఉన్న వరి పైరుకు నీరు తడికట్టేం దుకు పలు ప్రాంతాల్లో రైతులు నానా తంటాలుపడుతున్నారు .

ఇంకా ఎక్కడెక్కడ?

దేశంలో ఏటా కనీసం 133 జిల్లాలు కరువును ఎదుర్కొంటున్నట్లు ఐఐటీయన్ల స్టడీలో వెల్లడైంది. ఈసారి 241 జిల్లాలు మాత్రమే కరువును అధిగమించే స్థితిలోఉన్నట్లు తేలింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్,బీహార్, గుజరాత్, జార్ఖండ్ , కర్నాటక, మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కరువు ప్రభావం కనిపిస్తోంది.

నిండుకుంటున్న రిజర్వాయర్లు

ఎల్‌నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కుతోంది. దీంతో దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదవుతోంది. 2018 జూన్‌–డిసెంబర్‌ మధ్యతక్కువ వర్షపాతంతో దేశవ్యాప్తంగా నదులు, ఇతరజలాశాయాల్లో నీరు తగినంత చేరలేదు. దేశంలోని91 ప్రధాన రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటి నిల్వలుమార్చి 22 నాటికి 32 శాతానికి పడిపోగా, ఐదుదక్షిణాది రాష్ట్రాల్లో ని 31 జలాశయాల్లో 25 శాతానికిపడిపోయినట్లు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఎస్సారెస్పీ, సింగూరు,నిజాంసాగర్‌, జూరాల, నాగార్జునసాగర్‌ కిందఖరీఫ్‌లో సాగునీరందక పంటలు ఎండిపోయాయి.

కరువును ఎలా గుర్తిస్తారు?

నాలుగు అంశాల ఆధారంగా కరువును గుర్తిస్తారు. పంట దిగుబడి సగాని కంటే తక్కువ రావడం,శాటిలైట్‌ ఆధారంగా భూమిపై పరిస్థి తిని అంచనావేయడం(రిమోట్‌ సెన్సింగ్‌), మట్టిలో తేమ, భూగర్భజలమట్టాల విశ్లేషణ ద్వారా అంచనా వేస్తారు. తీవ్రకరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఈ నాలుగింటిలోకనీసం మూడు అంశాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉండాలి. కనీసం రెండు అంశాలతోపాటు వర్షపాతంతక్కువగా ఉంటే మోస్తరు కరువు ప్రాంతంగా గుర్తిస్తారు. ఒక ప్రాంతంలో కరువు ఉన్నట్లు గుర్తిస్తే అక్కడిరైతులకు జరిగి న పంట నష్టానికి సాయం, కూలీలకుపని కల్పించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మూడేళ్లుగా కరువు మండలాలను ప్రకటించలేదు.

పడిపోయిన యాసంగి సాగు

భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో పలు జిల్లాల్లో యాసంగి సాగు తగ్గింది.గోదావరిలో నీరు పూర్తిగా అడుగంటిం ది. కృష్ణాలోనూ అవే పరిస్థి తులున్నా యి. మెదక్‌, సంగా రెడ్డి జిల్లాల్లో వరి సాగు సగానికి సగం పడిపోయింది. జనగామ, వికారాబాద్‌, సిద్దిపేట, మహబూబ్ నగర్‌,మహబూబాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ పంటల సాగు తగ్గింది. గతేడాది యాసంగి లో రాష్ట్రవ్ యాప్తంగా 33 లక్షల 44 వేల ఎకరాల్లో వరి సాగైతే ఈసారి 30 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 3 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. మెట్టపంటల సాగు కూడా ఆశాజనకంగా లేదు. కందులు 45 శాతం, జొన్నలు 57 శాతం, పొద్దు తిరుగుడు 21 శాతం మాత్రమే సాగయ్యాయి. ఉల్లి అయితే 36 శాతమే సాగైంది.

సిటీలకు కటకట

2018లో నీతి అయోగ్‌ ప్రచురించిన కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం కరువు ప్రభావంతో 2020 నాటికి బెం గళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తో సహా 21 నగరాల్లో 10 కోట్ల మంది తాగునీటి సమస్య ఎదుర్కోనున్నారు . 2030 నాటికి 40 శాతం ప్రజలకు తాగునీరు దొరకని పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. తమిళనాడులో అత్యధికంగా 56.74 శాతం ప్రాంతాలకు కరువును అధిగమించగలిగే సామర్థ్యం ఉండగా, ఏపీలో 53.43%, తెలంగా ణలో 48.61, కర్నాటక లో17.38, కేరళలో 19.13 శాతం ప్రాంతాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.