
వయనాడ్ లో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి భారీగా మరణాలు సంభవించాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఇప్పటికే 358 కి చేరుకుంది. వరదల్లో, నివాసాల్లో, కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న శరణార్థుల కోసం సహాయక చర్యలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఈ విపత్తులో దాదాపు 200 మంది అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా శుక్రవారం వరకు 228 మృతదేహాలు, 134 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మృతుల్లో 96 మంది పురుషులు, 85 మంది మహిళలు, 29 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు.