పిల్లలను క్రమశిక్షణలో పెట్టే మార్గాలు

పిల్లలను క్రమశిక్షణలో పెట్టే మార్గాలు

చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచీచెడూ చెప్పడమే కాకుండా వాళ్లను  క్రమశిక్షణతో పెంచాలి అనుకుంటారు తల్లిదండ్రులు. అయితే కొన్నిసార్లు  పిల్లలు మాట వినరు. వద్దన్న పని చేసి దెబ్బలు తగిలించుకుంటారు. గాయాలు చేసుకుంటారు కూడా. అప్పుడప్పుడు చాలా అల్లరి చేస్తారు. దాంతో వాళ్లమీద కోపంతో గట్టిగా అరుస్తారు తల్లిదండ్రులు. తిట్టడం, కొట్టడం ద్వారా పిల్లల్ని దారిలో పెట్టొచ్చు అనుకుంటారు చాలామంది పేరెంట్స్. అయితే, పిల్లల్ని గట్టిగా మందలించడం, కొట్టడం కంటే  ప్రేమగా చెప్పడమే మంచిది అంటున్నారు సైకియాట్రిస్ట్లు.

తల్లిదండ్రులు పిల్లల మీద అరిస్తే, ఆ ఎఫెక్ట్ వాళ్ల మీద ఎక్కువ రోజులు ఉంటుంది. అప్పటి నుంచి  మూడీగా ఉంటారు. అందుకని పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ‘ఆ పని ఎందుకు చేయొద్దు?’ అనేది వివరంగా చెప్పాలి. ఆ తర్వాత  వాళ్ల తీరు మారిందా? లేదా? అనేది గమనించాలి. 

  •   పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా, మాట వినకున్నా వాళ్లపై గట్టిగా అరవొద్దు. ‘ఎందుకలా చేశావు’ అని అడగాలి.  వాళ్లు చెప్పేది ఓపికగా  వినాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ పని ఎందుకు చేయకూడదో అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే... గట్టిగా అరిచినా, మాట్లాడినా పిల్లలు భయపడతారు. ఆ భయంతో దగ్గరికి కూడా రారు కొందరు.  మరి కొందరు పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. పెద్దయ్యాక కూడా కొంతమంది పిల్లల్ని చిన్నప్పటి అనుభవాలు, భయాలు  వెంటాడుతాయి. అలాంటి వాళ్లలో బిహేవియర్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. 
  •   బయటికి వెళ్లినప్పుడు లేదా పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు పిల్లలు ఒకచోట కుదురుగా ఉండరు. కొత్తగా ఏం కనిపించినా అక్కడే ఆగిపోతారు. లేదంటే చెప్పకుండానే బయటకు వెళ్తారు. దాంతో అందరిముందు వాళ్లని తిడతారు కొందరు తల్లిదండ్రులు. కానీ, అలాచేయడం మంచిది కాదు. నలుగురి ముందు లేదా ఫ్రెండ్స్ ముందు మందలిస్తే పిల్లలు అవమానంగా భావిస్తారు.  కాబట్టి  ఎక్కడికైనా వెళ్లే ముందు ‘అక్కడ ఏమేం ఉంటాయి, ఎవరెవరు వస్తున్నారు’ 
  • అనేది వాళ్లకు  చెప్పాలి. దాంతో కొత్త ప్లేస్​కి వెళ్లినప్పుడు పిల్లలతో సమస్య ఉండదు.