వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సూర్యకిరణాల వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అతినీలలోహిత కిరణాలు కంటి కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. దీంతో కంటి జబ్బుల ప్రమాదం పెరిగిపోతుంది. సూర్య కిరణాలు 3 రకాలుగా ఉంటాయి. అవి యూవీఏ, యూవీబీ, యూవీసీ. యూవీఏ కిరణాలు కళ్ల లోతుగా చొచ్చుకుపోయి దృష్టిని ప్రభావితం చేస్తాయి. ఈ కిరణాలు రెటీనా వరకు వెళ్లి మాక్యులాను దెబ్బతీస్తాయి. యూవీబీ కిరణాలూ కళ్లకు హాని చేస్తాయి. ఇవి కార్నియా దెబ్బతినడానికి దారి తీస్తాయి. యూవీఏ ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. భూఉపరితలంలో ఉన్న ఓజోన్ పొర ద్వారా దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది మానవ చర్మాన్ని తాకితే అది చర్మ కణాల డీఎన్ఎ ను దెబ్బతీస్తుంది. చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
రక్షణ చర్యలే కీలకం...
సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ రేడియేషన్ తద్వారా మన కళ్లను రక్షించడానికి తీసుకున్న చర్యలే కళ్ల ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. హానికర కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ వాడవచ్చు. సన్ గ్లాసెస్ధరించడం ద్వారా కళ్లు సత్వర రక్షణ పొందుతాయి. ఎండలో నడిచేటప్పడు టోపీని ధరించండి. తద్వారా కిరణాలు చాలా వరకు మనపై పడవు. పిల్లలు వెడల్పాంటి అంచులు ఉన్న టోపీ ధరించడం మంచిది. డాక్టర్ల సూచనలు పాటిస్తే మేలు.