డెంగ్యూ జ్వరాల నుంచి రక్షణ ఎలా.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. !

డెంగ్యూ జ్వరాల నుంచి రక్షణ ఎలా.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. !

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జ్వరం. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ బాధితుల్లో కొందరికి డెంగీ వల్ల జ్వరం వస్తోంది. అసలు వచ్చింది మామూలు జ్వరమా? లేక డెంగీ జ్వరమా తెలుసుకోవడం ఎలా అన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తాయి.  ఈ ఏడాది జూలై 20  వరకు మొత్తం 163 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. నిల్వ ఉన్న నీళ్లలో పిల్లలు ఆడేటప్పుడు...  దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.  భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థకు అంతరాయం ఏర్పడి  కాలువల్లో  దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారతాయి. ఏడిస్ అనే దోమ కుడితే డెంగ్యూ వ్యాధి వస్తుంది.  ఈ దోమ కుట్టి డెంగ్యూ బారాన పడిన వారు  తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, వికారం, చలి మొదలగు లక్షణాలతో బాధపడుతుంటారు. 

  • పిల్లలకు   డెంగ్యూ వ్యాధి రాకుండా తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి
  • పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు చేతులు, కాళ్లు కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి. 
  • దోమలు కుట్టకుండా దోమతెరలు, కొన్ని రసాయక క్రిమి కీటకాలు మందులు వాడాలి.
  • ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 
  • యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.  
  • పండ్లు, బలమైన పోషకాలు ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వాలి. 
  •  ప్రేన్, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీలు మొదలైన పండ్లను పిల్లల ఆహారంలో చేర్చాలి.  

డెంగీ లక్షణాలు

  • జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 డిగ్రీలు
  • తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు
  • కళ్లలో విపరీతమైన నొప్పి
  • శరీరంపై దద్దర్లు
  • వాంతులు కావడం, కడుపునొప్పి
  • నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం
  • కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం 

డెంగీ లక్షణాలుంటే ఏంచేయాలి?

  • పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్‌ ద్రవాలను ఇవ్వాలి
  • జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి
  • దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్, లిక్విడ్, దోమ తెరలు వాడాలి

డెంగీని నివారించడానికి అనుసరించాల్సిన ఆయుర్వేదంలో ఉన్న జాగ్రత్తలు

  • నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 1015 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు.
  • బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాగిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి. 
  • క్యారెట్‌ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది.
  •  కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది.
  • డెంగ్యూ జ్వరం కారణంగా తల నెప్పి, వాంతులు, ముక్కు, నోటి చిగుర్ల నుండి రక్తం రావడం, పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
     

పిల్లలకు డెంగ్యూ జ్వరం వస్తే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? 

  • డెంగీ వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. జ్వరం తగ్గాక కూడా పూర్తిగా కొలుకోవడానికి ఒక నెల వరకు కూడా సమయం పట్టవచ్చు.
  • డెంగీ జ్వరం రోగనిరోధక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది.
  • జ్వరం తగ్గాక పోషకాలతో కూడిన, శుభ్రమైన పరిసరాల్లో తీసిన చెరకు రసం, కొబ్బరినీళ్లు, తాజా పళ్ళ రసం లాంటివి ఇవ్వాలి.
  • పాలు, పెరుగు, చేపలు, గ్రుడ్లు, కోడి మాంసం లాంటి పౌష్టికాహారం రోజువారీ ఆహారంలో చేర్చాలి.
  • పళ్లలో దానిమ్మపాళ్లు, కూరగాయలతో బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.


కొన్ని సందర్భాల్లో  జ్వరం వచ్చినపుడు ప్లేట్‌ లెట్స్‌ తగ్గి తీవ్రమైన ముప్పుకు దారి తీస్తుంది. ఏ వైరస్‌ శరీరంలో ఏ భాగాన్ని దెబ్బ తీస్తుంది అనే అవగాహన కలిగిన డాక్టర్‌ను సంప్రదించాలి. అలాంటప్పుడు ప్లేట్‌ లెట్స్‌ తగ్గుదలను నిరోధించడానికి కావలసిన మందులు వాడడంతో పాటు ఇతరుల నుంచి సేకరించిన ప్లేట్‌లెట్‌లను శరీరంలోనికి ఎక్కిస్తారు.బొప్పాయి ఆకుల రసం ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి దోహదం చేస్తుంది.డెంగ్యూ జ్వరం వచ్చిన తరువాత చర్య తీసుకొవడం కంటే ముందు అది రాకుండా నిరోధించడం మంచిది.డెంగ్యూ జ్వరం రాకుండా అడ్డుకొనే టీకా ప్రయోగ దశలో ఉన్నది కొన్ని నెలలలో అందుబాటులోకి రానుంది. అంత వరకు డెంగ్యూ సీజన్ లో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించడం మంచిది. కూలర్లలో , పూలకుండీలలో, పాత టైర్లలో... ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేకుంటే డెంగ్యూ దోమలు వీటిలో అభివృద్ధి చెందుతాయి. కిటీకీలకు తెరలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా చూడవచ్చు.