స్థానిక అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం

స్థానిక అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం
  • ఇతర రాష్ట్రాలు కలలో కూడా ఊహించని పథకాలు అమలవుతున్నాయి
  • చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్

రామచంద్రాపురం(పటాన్​చెరు), వెలుగు: ఎక్కడైతే పాలన పారదర్శకంగా ఉంటుందో అక్కడి ప్రభుత్వాలు ప్రజల మెప్పు పొందుతాయని సీఎస్​సోమేశ్​కుమార్ అన్నారు. ఉద్యమకారుడే ప్రభుత్వాధినేత కావడంతో రాష్ట్రంలో ఎన్నో ప్రజాహిత పథకాలకు రూపకల్పన జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కలలో కూడా ఊహించని స్కీములు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ‘కౌటిల్య– స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘విధాన నిర్ణయాలలో నా అనుభవం’ అనే అంశంపై స్టూడెంట్స్​తో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో విధాన నిర్ణయాలు కష్టంగా ఉండేవని, ప్రత్యేక రాష్ట్రంలో స్థానిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వగలుగుతున్నామని చెప్పారు.

మా బడి పథకం కింద 404 బడులు ఏర్పాటు చేశామని, పల్లె ప్రగతితో 12 వేల769 గ్రామాలు డెవలప్ చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అనిపిస్తే, ఆ నిర్ణయంతో కలిగే ప్రయోజనాలపైనా అంతే స్పష్టత ఉండాలని సలహా ఇచ్చారు. అనంతరం సీఎస్ సోమేశ్ ను గీతం ప్రెసిడెంట్ ఎం.శ్రీభరత్, సెక్రటరీ ఎం.భరద్వాజ్ సత్కరించారు.