
బషీర్బాగ్, వెలుగు: పౌర సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లక్డికాపూల్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు రూ.17.93 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించనున్న వరద నీటిని తరలించే కాలువలకు(స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్) నాంపల్లిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నగరంలో రోడ్లు, నాళాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. వరద నీటి కాలువల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులతో వరద సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ అసన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
స్టూడెంట్స్ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే
బషీర్బాగ్: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అబిడ్స్ స్టాన్లీ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని 108 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు.