కేంద్రంలో చక్రం తిప్పేది మనమే: కేటీఆర్

కేంద్రంలో చక్రం తిప్పేది మనమే: కేటీఆర్

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన… ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. ఇందులో TRS కీలక పాత్ర పోషించనుందన్నారు. ప్రధాని మోడీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుందని.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దుస్కెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని.. కేంద్రంలో మనమే కీలకం కావాలంటే 16 స్థానాల్లో TRS ను గెలిపించాలని కోరారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని.. యాచింది కాదు.. శాసించి హక్కులను సాధించుకోవాలంటే రాష్ట్రానికి ఎంపీ స్థానాలు కావాలన్నారు కేటీఆర్. ఇవాళ ప్రకటించిన 50 కొత్త కేంద్రీయ విద్యాలయాల్లో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదన్నారు. ఈ విషయంలో కూడా మరోసారి రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని… అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.